calender_icon.png 21 November, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థిరంగా సాగర్ నీటిమట్టం

16-08-2024 02:48:50 AM

  1. రెండు క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల 
  2. ఎగువ నుంచి 63 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో

నల్లగొండ, ఆగస్టు 15 (విజయక్రాంతి) : నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో స్థిరంగా కొనసాగుతోంది. గురు వారం సాయంత్రం 4 గంటల వరకు 6 క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఆ తరువాత ఎగువ నుంచి ఇన్ ఫ్లో తగ్గడంతో నాలుగు క్రస్టు గేట్లను మూసేశారు. రెండు క్రస్టు గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తోంది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహం ఆధారంగా రాత్రికి మరిన్ని క్రస్టు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

రిజర్వాయర్ నుంచి కుడి కాల్వకు 8,023 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7,518 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ (ఎస్సెల్బీసీ)కి 1,800 క్యూసెక్కులు, లో లెవల్ కాల్వకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తు న్నారు. ఎగువ నుంచి రిజర్వాయర్‌కు 63 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో అంతే మొత్తంలో అవుట్ ఫ్లో కొనసాగిస్తున్నారు.

‘పోచారం’ నుంచి జలాల విడుదల

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల పరిధిలోని పోచారం ప్రాజెక్ట్ నుంచి ఆయక ట్టుకు జలాలు విడుదల చేయాలని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు చెంది న రైతులు కొన్ని రోజులుగా కొరుతున్నారు. వారి ఆశలు ఫలించి గురువారం నీటిపారుదలశాఖ అధికారులు గురువారం దిగువకు జలాలు విడుదల చేశారు. ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎస్‌ఈ విద్యావతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లేశం, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో తాండూర్ సింగిల్ విండో చైర్మన్ రాకిరి గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్‌గౌడ్, వెంకటేశ్వర్లు, రాంచంద్రారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.