10-01-2026 08:22:58 PM
పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ,(విజయక్రాంతి): వాగ్దేవి కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి, గొబ్బమ్మలను పేర్చి, భోగిమంటలు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలను వెలిగించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ, అభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని అన్నారు.
కళాశాలలో విద్యార్థులు వేసిన హరిదాసు వేషాదరణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల చైర్మన్ చందుపట్ల దేవేందర్ రెడ్డి దంపతులు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తడుక సుమన్, డైరెక్టర్ శ్రవణ్ రెడ్డి, నాయకులు సుగుణాకర్ రెడ్డి, అశ్విన్ రాథోడ్,బాలు నాయక్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.