calender_icon.png 22 November, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరా గ్రూప్ ఆస్తుల వేలం

22-11-2025 01:42:34 AM

రూ.19.64 కోట్ల స్థిరాస్తికి వేలం వేసిన ఈడీ

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): హీరా గ్రూప్ ఆస్తులను ఈడీ శుక్రవారం వేలం వేసింది. హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన రూ.19.64 కోట్ల విలువైన స్థిరాస్తి వేలం వేసింది. కొన్నేళ్ల క్రితం 36 శాతం వడ్డీ పేరుతో అధిక లాభాల ఆశ జూపిన హీరా గ్రూప్.. పెట్టుబడిదారుల నుంచి రూ.5,978 కోట్లు సేకరించింది. ఆ తర్వాత అసలు, వడ్డీ ఇవ్వకుండా మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ.. హీరా గ్రూప్‌నకు చెందిన రూ.428 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. కాగా ఇప్పటివరకు రూ.93.63 కోట్ల విలువైన కంపెనీ ఆస్తుల్ని వేలం వేసింది. వేలం ద్వారా సేకరించిన మొత్తాన్ని హీరా గ్రూప్ బాధితులకు అందిస్తామని ఈడీ పేర్కొంది.