2 April, 2026 | 2:45 AM

అభివృద్ధికి అరబిందో ఫార్మా చేయూత

02-04-2026 12:56 AM

నవాబ్ పేట, ఏప్రిల్ 1 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌ లిక వసతుల కల్పనకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం అరబిందో ఫార్మా ప్రతినిధులు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను వారు పరిశీలించారు.

విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను తమ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ఉపాధ్యాయ బృందం, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి చొరవ చూపిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి, అరబిందో ఫౌండేషన్ వారికి పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.