calender_icon.png 21 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయానికి చేరువలో ఆస్ట్రేలియా

21-12-2025 12:00:00 AM

యాషెస్ సిరీస్ మూడో టెస్ట్

అడిలైడ్, డిసెంబర్ 20 : యాషెస్ సిరీస్ విజయానికి ఆస్ట్రేలియా చేరువైంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ గెలుపుకు మరో 4 వికెట్ల దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సా ధించిన కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 349 రన్స్‌కు ఆలౌటయ్యారు. ట్రావిస్ హెడ్ 170 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ 72 రన్స్‌కు ఔటయ్యాడు. దీంతో 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్  రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది.

డకెట్ (4), పోప్ (17), స్టోక్స్(5) పరుగులకే ఔటవగా.. జాక్ క్రాలే(85) హాఫ్ సెంచరీతో రా ణించాడు. రూట్ (39), బ్రూక్(30) పరుగులతో పర్వాలేదనపించారు. కీలక బ్యాటర్లంద రూ విఫలమవడంతో ఇంగ్లాండ్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగోరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లకు 207 పరుగులు చేసింది.