calender_icon.png 21 December, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ ఓటమి

21-12-2025 12:00:00 AM

హాంగ్‌జౌ, డిసెంబర్ 20 : ఏడాది చివరి బ్యాడ్మింటన్ టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూ ర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జోడీ సాత్విక్ సాయిరాజ్ , చిరాగ్ షెట్టి పోరాటం ముగిసింది. భారత జోడీ సెమీఫైనల్లో పరాజ యం పాలైంది. వరుస విజయాలతో టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన సాత్విక్-చిరాగ్ జోడీ హోరాహోరీ పోరులో 21-10, 17-21, 13-21 స్కోర్ తేడాతో చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్, వాంగ్ చెంగ్ జంట చేతిలో పోరాడి ఓడింది.

తొలి గేమ్ గెలుచుకున్న తర్వాత ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం లో భారత జంట విఫలమైంది. గంటా 3 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చైనా పెయిన్ అద్భుతంగా పుంజుకుంది. రెండో గేమ్‌లో ఆధిక్యం సాధించే అవకాశం వచ్చినప్పటకీ చైనా ప్లేయర్స్ దూకుడుగా ఆడి ఆ అవకాశం లేకుండా చేశారు.