calender_icon.png 17 January, 2026 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మకూరు, మాసంపల్లి ప్రధాన రహదారిపై పడిన గుంతను పూడ్చిన అధికారులు

17-01-2026 02:20:42 AM

విజయక్రాంతి కథనానికి స్పందన

నాగిరెడ్డిపేట్,జనవరి 16 (విజయ క్రాంతి):మండలంలోని చిన్న ఆత్మకూర్,మాసంపల్లి ప్రధాన రహదారి వెంబడి వెళ్తుండగా చిన్న ఆత్మకూర్ గ్రామ శివారు  పరిధిలో గల వైకుంఠధామం సమీపాన రోడ్డుకు ఇరువైపులు ఉన్న పంట పొలాల రైతులు పైప్ లైన్ నిమిత్తం రోడ్డును తవ్వి మట్టితో పూడ్చినప్పటికీ పెద్దగుంత అలాగే ఉండడంతో రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో విజయక్రాంతి దినపత్రిక.

గమనించి వార్త ప్రచురించడంతో ఆకథనానికి అధికారులు స్పందించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్దగుంతను పూర్తిగా మట్టితో నింపడం జరిగిందని  ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా నాలుగు గ్రామాల ప్రయాణికులు,ప్రజలు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్కు ఆర్‌అండ్బి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.