calender_icon.png 9 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలకు ప్రాణం పోసిన వర్షాలు

09-08-2025 12:36:53 AM

గద్వాల రూరల్, ఆగస్టు 8: గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. గత నెల క్రితం పడిన వర్షాలకు పంటలు సాగు చేసిన రైతన్నలకు ఏపుగా పెరిగిన పంట ఎండిపోతుందనే విధంగా పంటలు వాడి పోవడంతో రైతన్నలు తీవ్ర దిగాలు వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రతి మిరప కంది ఇతర పంటలకు ఊపిరి పోసినట్లు అయింది.

వేల రూపాయలు పెట్టి పంట పండించే రైతన్నలకు సకాలంలో వర్షాలు కురిస్తే అంతకంటే పండుగ ఏముంటుంది. గద్వాల మండలంలోని పలు గ్రామాలలో ప్రతి మిరప కంది వరి తదితర పంటలను సాగు చేశారు. కొన్ని ప్రాంతాలలో బోరుబావులు క్రింద మరికొన్ని ప్రాంతాలలో పిజెపి కాలువ క్రింద పంటలు సాగు చేయడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిస్తే రైతన్నలకు రైతు కూలీలకు పనులకు కొదువలేదు.