calender_icon.png 29 October, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

29-10-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఘట్ కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఘట్ కేసర్ బైపాస్ రోడ్డు సమీపంలో గట్టు మైసమ్మ ఆటో యూనియన్ వారితో ఘట్ కేసర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్  రవీందర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ప్రాముఖ్యత తెలియజేస్తూ ఆటో డ్రైవర్లు పాటించవలసిన నిబంధనలు, జాగ్రత్తలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ విజయ్ కృష్ణమూర్తి, మహిపాల్ రెడ్డి, ఏఎస్‌ఐ తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సీతారాం నాయక్, రవీందర్ రెడ్డి , సయ్యద్ ఇబ్రహీం, కానిస్టేబుల్ మల్లేష్, రవితేజ పాల్గొన్నారు.