calender_icon.png 29 October, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకతాయిలు వేధిస్తే మౌనం వద్దు

29-10-2025 12:00:00 AM

 షీ టీం సబ్ ఇన్‌స్పెక్టర్ మౌనిక

వెంకటాపూర్(రామప్ప), అక్టోబర్28, (విజయక్రాంతి): మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే మౌనం వహించకుండా వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక కోరారు. మండలంలోని పాలంపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టి సేవ్ యాప్, షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా షీ టీం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందని, ఎక్కడైనా వేధింపులు, అనుచిత ప్రవర్తన చోటుచేసుకున్నా తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. వేధింపులు ఎదురైనప్పుడు భయపడకండి. మౌనం వహిస్తే తప్పు చేసే వారికి ధైర్యం వస్తుందని, షీ టీం హెల్ప్లైన్ లేదా 8712576528 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. సామాజిక భద్రత కోసం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఆకతాయితనాన్ని అరికట్టడంలో ప్రజల సహకారం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కానిస్టేబుల్ చైతన్య, నవ్య, యశోద, ఆలేఖ్య పాల్గొన్నారు.