10-02-2025 01:05:09 AM
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : మన్నెంకొండ జాతర సమయం లో ఆటోలు జాగ్రత్తగా నడపాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్ ఆటో కార్మికులకు సూచించారు. ఆదివా రం వ్యవసాయ కార్మిక సంఘం అనుబంధ సంఘమైన మన్నెంకొండ స్టేజీ ఆటో యూ నియన్ ఆధ్వర్యంలో ముద్రించిన గుర్తింపు కార్డులను ఆటో కార్మికులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల తిరుపతిగా భావించే మన్నెంకొండ జాతరకు అత్యధికులు పేద ప్రజలే వస్తారని చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది వస్తారని వారందరిని సురక్షితంగా జాతరకు తీసుకెల్లె బాధ్యత ఆటో కార్మికుల పైన ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఘాట్ రోడ్ మీద జాగ్రత్త ఆటోలు నడపాల ని సూచించారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రయాణం కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి హనుమంతు, మండల నాయకులు ఆటో యూనియన్ నాయకులు చిన్న వెంకట రాములు, కే.సాయిలు, రామచంద్రయ్య, దశరథ్ నాయక్, రాజకృష్ణ, ఇరియా నా యక్, పి.లక్ష్మణ్, రవిబాబు, కే శ్రీనివాసు లు, కే మల్లేష్, చిన్న కుర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.