06-12-2024 01:39:13 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): కాలుష్యంతో ఢిల్లీ నగరం తల్ల డిల్లుతోందని.. ప్రపంచంలోనే అత్యంత చెత్త నగరంగా కోల్‌కతా పేరు తెచ్చుకుందని.. వరదలతో చెన్నై సతమతమ వుతోందని.. కానీ, హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
హైదరాబాద్‌ను కాలు ష్య నగరంగా మారనివ్వొద్దని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారడంలో రవాణాశాఖ కీలకపాత్ర వహించాలని పేర్కొన్నారు. ప్రజాపాలన- విజయోత్సవాల్లో భాగంగా గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రవాణా శాఖ, ఆర్టీసీ తరఫు న ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు.
హెల్మెట్ ధరించి ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ఆ తర్వాత రవాణాశాఖ కొత్త లోగోను ఆవిష్కరించారు. రవాణా శాఖ తీసుకువచ్చిన స్క్రాప్ పాలసీ ఏజెన్సీలకు ఆథరైజేషన్ పత్రాలను అందించారు. ఆర్టీసీలో కారు ణ్య నియామకాలకు సంబంధించి 54 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.
అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆర్టీసీ డీజిల్ బస్సులతోపాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే ఆటోలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు తాము ప్రవేశపెట్టిన ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ అద్భుతంగా పనిచేస్తాయని చెప్పారు.
కాలంచెల్లిన (15 ఏళ్లు దాటిన) వాహనాలను స్క్రాప్‌కు పంపాల్సిన బాధ్యత రవాణాశాఖపై ఉందన్నా రు. రెండేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి కాపాడుతామని, నగరంలోని డీజిల్ బస్సులన్నింటినీ జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. నగరంలో చాలామటుకు ఆటోల్లో పెట్రోల్ బదులు కిరోసిన్ పోస్తున్నారని.. అందుకే సిటీలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను సైతం ఔటర్ బయటకు పంపించేస్తామన్నారు.
ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ప్రణాళిక రూపొందించా లని అధికారులను ఆదేశించారు. కాలు ష్యం మనకు మనమే వేసుకున్న మరణ శిక్ష లాంటిదని చెప్పారు. అవసరమైతే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్‌లో కాలుష్యాన్ని పారదోలుతామని స్పష్టంచేశారు. గోదావరి అను సంధానంతో మూసీని అభివృద్ధి చేస్తామ ని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరం గా నిలబెట్టేందుకు కృషిచేస్తామన్నారు.
115 కోట్ల మంది మహిళల ఉచిత బస్సు ప్రయాణం
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందించిన ఉచిత ప్రయాణమే ఆర్టీసీకి ఊపిరి పోసిందని సీఎం అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 115 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా రూ.4 వేల కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని, అదే మొత్తం ఆర్టీసీకి లాభంగా అందిందని చెప్పారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతి ఆడబిడ్డ ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.7 వేలు ఆదా చేయగలుగుతున్నదని వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణాలు ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగును నింపే కార్యక్రమంగా మారినట్టు స్పష్టంచేశారు. స్వరాష్ర్ట సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని.. గతం లో సీఎంగా చేసిన కేసీఆర్ అయినా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న తానైనా బాధ్యతాయుతంగా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందేనన్నారు.
ముక్కుకు బట్టకట్టే దుస్థితి రావద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లోనూ ముక్కుకు బట్ట కట్టుకు తిరగాల్సిన పరిస్థితి రావద్దని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలాంటి పరిస్థితిని అధిగమించేందుకు రవాణాశాఖ తరఫున అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈవీ పాలసీ తీసుకువచ్చి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాము వచ్చాక రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.
ఈవీ పాలసీతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. స్క్రాప్ పాలసీ ద్వారా 15 ఏళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్న వాహనాలు స్క్రాప్ చేయనున్నామని, ఫలితంగా కాలుష్యం తగ్గుతుందని, ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్, ఆటోమెటిక్ డ్రైవింగ్ సెంటర్స్ తెస్తున్నామని, ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా 113 మంది ఏఎంవీఐలకు నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు. రవాణా శాఖ యూజర్ చార్జీలు వాడుకునేలా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రవాణా శాఖకు కొత్త లోగో
రవాణాశాఖకు తొలిసారి లోగో తెచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీయే ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 213 కొత్త వాహనాలను తెస్తున్నామని, వీటికి కొత్త లోగో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని 10 ఏళ్లుగా చంపి బొంద పెట్టిందని ఆరోపించారు. మహాలక్ష్మి ద్వారా ప్రతి నెల రూ.350 కోట్ల నుంచి రూ-.400 కోట్లు కేటాయించడంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రామ్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేందర్‌మోహన్ పాల్గొన్నారు.
వాళ్లు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోయారు
గత పాలకులు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే తాము 55,143 ఉద్యోగ నియామకాలు చేశామని సీఎం స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ర్టంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని ఉద్ఘాటించారు.
అనుమానం ఉంటే 55,143 మందిని ఇదే హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌కు తీసుకువస్తామని, వారందరినీ లెక్క చూసుకోవచ్చని చెప్పారు. అందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి నెలా ఒక కుటుంబానికి రూ.10 వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోందని చెప్పారు. రాష్ర్టంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.21వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశామన్నారు. వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నామని స్పష్టంచేశారు. 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు.