calender_icon.png 11 July, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెన్‌ఫిట్ షోలను రద్దు చేయాలి

06-12-2024 01:37:31 AM

సంధ్య థియేటర్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ధర్నా

ముషీరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): చలన చిత్రాలకు సంబంధించిన బెన్‌ఫిట్ షోలను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్  డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ మృతిచెందడం, ఆమె కుమారుడు అస్వస్థతకు గురికావడంపై గురువారం వారు ఆయా సంఘాలతో కలిసి థియేటర్ వద్ద నిరసన తెలిపారు.

సినీస్టార్ అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతోనే తొక్కిసలాట జరిగిం దన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్‌లు చేయాలన్నారు. నిరసనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.