23-11-2025 12:00:00 AM
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట కలెక్టరేట్/గజ్వేల్, నవంబర్ 22: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ముందుకు సాగాలని మహి ళా సంఘాల సభ్యులకు కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్‌లో సిద్ది పేట నియోజకవర్గ మహిళా సంఘాలకు 42,487 ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వం అప్పగించిన పనులను సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందుతున్నా యని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని 28 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మహిళలు పారిశ్రామిక రంగంలో అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఇందుకో సం సిద్దిపేటలో మహిళా సెల్ఫ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో లక్షా యాభై ఐదు వేల స్కూల్ యూనిఫార్మ్లను లోపం లేకుండా కుట్టడం గొప్ప విషయం అని మంత్రి అభినందించారు. జిల్లాలో 11 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా, బేస్మెంట్ పూర్తిచేసుకున్న 9,000 ఇండ్లకు ఒక్కొక్కటికి లక్ష చొప్పున నిధులు విడుదలయ్యాయని తెలిపారు.
వచ్చే ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించా రు. జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సం ఘాలకు 866 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరైనట్లు చెప్పారు.
200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్, సన్నబియ్యం ఉచిత పంపిణీ, కొత్త రేషన్ కార్డులు మా ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రత్యేకమైనవి అని అన్నారు. అక్బర్‌పే ట్ భూంపల్లి మండలంలోని చిట్టాపూర్ పెద్ద చెరువులో మంత్రి వివేక్ 2.20 లక్షల చేప పిల్లలను వదిలారు. ఆయా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో సదానందం, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, మత్స్యశాఖ అధికారి మల్లేశం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దుబ్బాక ఐడిఓసిలో మహిళా సంఘాలకు 43,800 చీరలను పంపిణీ చేశారు. గజ్వేల్ పట్టణంలోని ఐఓసీలో నియోజకవర్గంలోని ఆరు మండలాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవ్ ఆర్య, ఆర్డీవో చంద్రకళ, ఏఎంసీ చైర్మన్‌లు వంటేరు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.