calender_icon.png 15 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

15-08-2025 12:22:52 AM

మిర్యాలగూడ, ఆగస్టు 14 (విజయక్రాంతి-):   జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మిర్యాలగూడ షీ టీం ఏ ఎస్ ఐ నందిపాటి ప్రభాకర్ మిర్యాలగూడ లోని బిసి గురుకుల పాఠశాలలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు యువతులు మహిళల సాంఘిక భద్రత కోసం షీ టీం పని చేస్తుంది అన్నారు. 

ఆకాతాయిల నుంచి వ్యక్తిగతంగా సామాజిక మధ్యమాల ద్వారా వేధింపులకు గురైతే తక్షణమే షీ టీం పోలీసులను ఆశ్రయించాలన్నారు. రక్షణ కోసం డయల్ 100 కి ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్స్ పాల్  పి.నవీన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ జి. నాగేంద్రమ్మ, హుస్సేనాయక్, హెచ్.జి రవీందర్,   తదితరులు పాల్గొన్నారు.