15-08-2025 12:22:35 AM
గోపాలపేట ఆగస్టు 14: భారీ ముసలి రావడంతో భయాందోళనకు ప్రజలు గురవుతున్న సంఘటన గోపాలపేట మండలంలో కలకలం రేపింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి, చెన్నూరు గ్రామాల ప్రజలు ముసలి నోట్లో పడతాము నన్ను బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఒనికి పోతున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వాగులు వంకలు తెగిపోయి నీరంతా ఇండ్ల మధ్య తాండవిస్తోంది.
భారీ వర్షానికి గోపాలపేట మండలం చెన్నూరు గ్రామం జలదిగ్బంధమయింది ఈ గ్రామానికి మూడు రహదారులు ఉన్నా ఫలితం శూన్యం. గోపాలపేట నుండి తత్వ చెరువు, తాడిపర్తి నుండి లక్ష్మి సముద్రం చెరువు, బుద్ధారం నల్లచెరువు లు పొంగిపొర్లుతున్నాయి దీంతో ఈ గ్రామాల వైపు ఉన్న మూడు రహదారులు కూడా నీళ్లతో నిండిపోయాయి చెన్నూరు గ్రామ ప్రజలు గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా నీళ్లు కమ్మేశాయి.
ఇక లక్ష్మి సముద్రం చెరువులో భారీ ముసలి ఉండడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ నీటి నుండి ముసలి ఎక్కడ బయటకు వచ్చి ఈ గ్రామం పై పడుతుందోనని ఆ గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఇక గోపాలపేట లో ఉన్న ఎర్రకుంట నీలాయకుంట రెడ్లకుంట అమ్మచెరువులు సైతం పొంగిపొర్లుతున్నాయి. వాగుల్లో వర్షపు నీరు నాట్యం చేస్తూ పారుతున్నాయి.
రెడ్ల కుంట నుండి వచ్చిన నీరంతా అయోధ్య కాలనీ చుట్టుముట్టేసింది. దీంతో గోపాలపేటలో ఉన్న అయోధ్య కాలనీ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. నీరు ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల చుట్టే ఉండడం పట్ల విషపురుగులు ఇండ్లలోకి వస్తాయని కాలనీ ప్రజలు భయం భయంగా ఉన్నారు. స్థానిక పోలీసులు తాడిపర్తి లక్ష్మీ సముద్రంపై భారీ గేట్లను వేసి ప్రజలను అక్కడికి రాకుండా బందోబస్తుగా ఉన్నారు.
ప్రజలం తా అప్రమత్తంగా ఉండాలని ఎస్త్స్ర తెలిపారు. మండల రెవెన్యూ మండల పరిషత్ అధికారులు వెంటనే స్పందించి గోపాలపేట లో ఉన్న అయోధ్య కాలనీలో చుట్టుముట్టేసిన నీరును తొలగించే ప్రయత్నం చేస్తే ఊపిరి పీల్చుకుంటారని కోరుతున్నారు.