calender_icon.png 31 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొప్పదండిలో కుష్టు రహిత సమాజానికి అవగాహన

31-01-2026 12:14:03 AM

డాక్టర్ సుధా రాజేంద్ర అడిషనల్ డీఎంహెచ్‌ఓ కరీంనగర్

చొప్పదండి 30 జనవరి (విజయక్రాంతి): చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భం గా డాక్టర్ సుధా రాజేంద్ర ‘స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్‘ (స్లాక్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ లెప్రసీ రహిత సమాజాన్ని ఆవిష్కరించాలంటే ప్రతి ఒక్కరు కూ డా లెప్రసీ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండాలి అన్నారు.

ఈరోజు నుంచి మొదలుకొని రెండు వారాలపాటు సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా వ్యాధి పై చైతన్తం చేయాలని, తొలి దశలోనే స్పర్శ లేని, రాగి రంగు లేదా తెలుపు రంగులో మచ్చలు గుర్తించి, ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న చికిత్సను తీసుకొని అంగవైకల్యం గురికాకుండా కాపాడాలనీ, లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న వారిని ఎలాంటి వివక్ష చూపరాదని అన్నారు.ముందుగా డాక్టర్ అనుష , కీర్తన వైద్యాధికారులు కార్యక్రమం గురించి వివరించారు.