31-01-2026 12:11:23 AM
కేసీఆర్‌కి ఇచ్చిన సీట్ నోటీసులు తక్షణం వెనక్కి తీసుకోవాలి
భద్రాచలంలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వినతిపత్రం సమర్పణ
భద్రాచలం, జనవరి 30, (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుడు పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని స్వర్ణ యుగంగా నడిపిన వ్యక్తి కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని బిఆర్‌ఎస్ నాయకులు ఆకోజు సునీల్ కుమార్ అన్నారు... భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఫోన్ టాపింగ్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కి నోటీస్ ఇవ్వడం వారి అవివేకానికి నిదర్శమని అన్నారు.. అసలు ముఖ్యమంత్రి కి ఫోన్ టాపింగ్ కి సంబంధం ఉండదని కేవలం రాజకీయ క్రీడల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని అన్నారు. సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, కొల్లం జయ ప్రేమ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, కొండముక్కల సాయిబాబు,నర్సింహులు, వాసిపోయిన మోహన్ రావు కాపుల సూరిబాబు, రావూరి రవికిరణ్,గోసుల శ్రీనివాస్, నరేష్.రామకృష్ణ. తమాషాయ్య, ప్రదీప్,నాగరాజు, పూజల లక్ష్మి,తెల్లం రాణి, రవికుమారి, ప్రియాంక,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.