calender_icon.png 2 December, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిడ్స్ నిర్మూలనకు అవగాహనే మార్గం

02-12-2025 01:17:07 AM

  1. కలెక్టర్ రాజర్షి షా

నియంత్రణపై అవగాహన ర్యాలీ 

ఆదిలాబాదు, డిసెంబర్ 1 (విజయక్రాం తి): ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్క రూ అవగాహన కలిగి ఉండటం ఒక్కటే మార్గం అని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముందుగా జిల్లా వైద్య సిబ్బంది, విద్యార్థులతో కలిసి కళాజాత బృందం డప్పు పాటలతో ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ నియంత్రణకు సేవలందించినందుకు గాను పలువురు వైద్యులకు, ఎయిడ్స్ పై నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటాలను కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని, ఎయిడ్స్ వ్యాధి గ్రస్థుల సహాయర్థమై జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి అధికంగా ప్రబలే అవకాశం ఉన్న ప్రత్యేక వర్గాలను గుర్తించి ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి గుర్తించిన బాధితులకు సత్వర చికిత్స అందించాలని తెలిపారు. ప్రసూతి మరణాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా అధికారులు, సిబ్బంది మరింత పట్టుదలతో పనిచేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.