calender_icon.png 2 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో పనిచేయాలి

02-12-2025 01:18:19 AM

  1. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు..

పనులను పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్

ఆదిలాబాదు, డిసెంబర్ ౧ (విజయక్రాం తి): సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4న జిల్లా పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం  ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న సీఎం సభ ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని, స్టేజ్ ఏర్పాటు, వైద్య శిబిరం, పారిశుధ్యం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. పర్యటన రోజున అధికారులు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు.

ఏరోడ్రోమ్ లో హెలిపాడ్, పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్  అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న ప్రజా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ బందో బస్తు, ట్రాఫిక్ నియంత్రణ, మార్గాల గుర్తింపు వంటి అంశాలపై విభాగాలకు దిశానిర్దేశం చేశారు.

సిఎం పబ్లిక్ సమావేశానికి పెద్ద సంఖ్య లో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక పాల్గొన్నారు.

జిల్లాకు చేరుకున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు...

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, 6 గ్యారంటీల అమలు చైర్మన్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లాకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4వ తేదీన జిల్లా పర్యటన సందర్భంగా  ఏర్పాట్లను పరిశీలించడానికి సోమ వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మావల బైపాస్ వద్ద సుదర్శన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం.  పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో కలిసి సీఎం పర్యటనపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. 

కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ హందన్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి లు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డిసిసి సాజిద్ ఖాన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.