28-05-2025 05:01:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణా చిన్నపిల్లల భద్రత అంశంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ గా శ్రీమతి ఏ రమాదేవి, ముఖ్య అతిథులుగా పరమేశ్వర్ ఏసీజి, వేల్పూర్ నరసయ్య ఎస్ఓ, స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ సార్, రిసోర్స్ పర్సన్లుగా శ్రీ సిరాజ్, శ్రీఅనిల్ వ్యవహరించారు. సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆడవాళ్లు పిల్లలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కేజీబీవీ వసతి గృహాల్లో గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులకు బాలికలకు లైంగిక వేధింపులపైన బాలికలకు సంబంధించినటువంటి అక్రమ రవాణాపైన అవగాహన కల్పించడం కోసం కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులను ఈ శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం అనంతరం వారు విద్యార్థుల్లోపల చైతన్యాన్ని నింపి తద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని కోర్సు డైరెక్టర్ శ్రీ రమాదేవి మేడం చెప్పడం జరిగింది.