28-05-2025 05:06:25 PM
సమావేశానికి హాజరైన ముఖ్య అతిథులను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు..
నియోజకవర్గ ఇన్చార్జికే సమాచారం ఇవ్వకుండా నిర్వహించిన సమావేశం..
రవీందర్ రెడ్డి వర్గీయుల ఆందోళన..
ఉద్రిక్తత వాతావరణాన్ని చల్లార్చిన పోలీసులు..
కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు రాజకీయం కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో వర్గ పోరు బయటపడింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డికి అతని వర్గీయులకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. సమావేశం హాజరైన ముఖ్య నేతలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి(Congress President Manala Mohan Reddy), నియోజకవర్గ స్థాయిసమావేశ ఇంచార్జ్ వేణుగోపాల్ యాదవ్ ముందే సీనియర్ కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్నారు. తాము పార్టీని నమ్ముకుని పనిచేసిన ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నాయకుల పెత్తనం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక పోలీసులు చేరుకొని కాంగ్రెస్ ఇరువర్గాల నాయకులతో మాట్లాడి ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించారు. దీంతో సమావేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలకు సమాచారం ఇవ్వకపోవడంతో సమావేశ స్థానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. పోచారం శ్రీనివాస్రెడ్డి అనుచరుల తీరును నిరసించారు. బహాబాయికి సైతం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దిగారు. సమావేశాన్ని ఎట్టకేలకు నిర్వహించి మమ అనిపించారు.