28-05-2025 04:49:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ భీమ్ రెడ్డి మౌలానా సురేష్ రాజేశ్వర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఎఫ్ ఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి సీనియర్ నాయకులు భూషణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.