17-01-2026 12:00:00 AM
కోదాడ జనవరి 16: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యానికి చేరాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్‌ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా కోదాడ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యానికి చేరడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రయాణ సమయంలో రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదా లను నివారించవచ్చని పేర్కొన్నారు.