17-01-2026 12:00:00 AM
కమిషనర్ అంబటి రమాదేవి
కోదాడ, జనవరి 16: కోదాడ మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితా కమిషనర్ అంబటి రమాదేవి విడుదల చేశారు. శుక్రవారం ఆమె కోదాడ మునిసిపాలిటీ ఆవరణలో మాట్లాడుతూ పట్టణంలోని 35 వార్డులలోని 91 పోలింగ్ బూత్ లలో ఓటర్ల తుదిజాబితా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, మునిసిపల్ ఆఫీసులలో ప్రకటి స్తున్నట్లు వివరించారు. ఫోటోల వారిగా ఓటర్ల తుది జాబితా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మేనేజర్ రమేశ్, రెవిన్యూ ఆఫీసర్ అనిత, సోమయ్య, రాజయ్య, హమీద్ బాబా, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.