23-10-2025 08:32:41 PM
బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో ఈ నెల 26వ తేదీన సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మందమర్రి జిఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. గురు వారం బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో మెగా జాబ్ మేళా పోస్టర్ లను సింగరేణి అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతీ, యువకుల ఉపాధి కోసం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, సుమారు 60 నుంచి 70 వివిధ రకాల కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులు వారి అర్హతలను బట్టి ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షించారు. పెద్ద మొత్తంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఈ మేళాను బెల్లంపల్లి, మందమర్రి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం విజయ ప్రసాద్, బెల్లంపల్లి బ్రాంచి ఏఐటీయూసీ కార్యదర్శి దాగం మల్లేష్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీఎంఓ ఏఐ ప్రెసిడెంట్ రమేష్, సివిల్ ఎస్ ఈ రాము, ఎంవీటిసి శంకర్, ఏఐటియూసి మందమర్రి బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, అధికారులు పాల్గొన్నారు.