17-01-2026 04:11:39 AM
జనవరి 16 (విజయ క్రాంతి):సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా చోట్ల కోడి పందేలు జరుగుతున్నాయి. కానీ, ఆరేడు తరాలు చెప్పుకునే పందెం గెలిచింది. బరిలో యజమాని నమ్మకాన్ని నిలబెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామ య్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండో రోజు భారీ కోడి పందెం బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేష్ కోళ్ల మధ్య పందెం యమరంజుగా సాగింది.
ప్రభాకర్ సేతువ రకం కోడిని బరిలోకి దించగా రమేష్ డేగను వదిలాడు. రెండు కోళ్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. పందెం కూడా పెద్దదే కావడంతో ప్రేక్షకులంతా చూపు తిప్పకుండా చూశారు. చివరకు రమేష్‌కు చెందిన కోడి ప్రత్యర్థి కోడిని పడగొట్టింది. రూ.1.53కోట్లు గెలుచుకున్నాడు.. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ పందెం అని స్థానికులు చెబుతున్నారు.