calender_icon.png 30 January, 2026 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు బీసీలచే బీఫారాలు

30-01-2026 12:37:20 AM

  1. అందుకే టీఆర్పీ అవతరించింది
  2. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 
  3. జిల్లా ఇన్‌చార్జిలకు బీ-ఫారాలు అందజేత

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం పార్టీ జిల్లా ఇన్‌చార్జులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన బీ--ఫారాలను జిల్లా ఇన్‌చార్జులకు అందజేశారు. అలాగే ఆయా అభ్యర్థులకు బీ-ఫారా లు అందజేసే ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన అధికారాలను జిల్లా ఇన్‌చార్జులకు అప్పగించారు.

ఈ సందర్భంగా మాట్లా డిన తీన్మార్ మల్లన్న తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. గత 78 ఏళ్లుగా బీసీలకు బీఫారాలు ఇవ్వడం కోసం అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ ఆఫీసుల మెట్లకాడ బీసీలను నిలబెట్టిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. బీసీలకు రాజకీ య హక్కులు, ప్రతినిధిత్వం ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకులుగానే ఈ పార్టీలు ఉపయోగించుకున్నాయని విమర్శించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీసీలకు బీసీలే బీఫారాలు ఇచ్చుకునే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవతరించిందని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్ర మే కాదని, బీసీల రాజ్యాధికార దిశగా వేసిన చారిత్రాత్మక అడుగన్నారు. బీసీలకు రాజకీయాధికారం ఇవ్వడమే తెలంగాణ రాజ్యాధి కార పార్టీ ప్రధాన విధానం, లక్ష్యమని స్పష్టం చేశారు.

టీఆర్పీ పార్టీ తరఫున బీసీలకు ఈ స్థాయిలో అవకాశం కల్పించగలగ డం తన జీవితంలో గర్వకారణమని పేర్కొ న్న మల్లన్న, రాబోయే రోజుల్లో టీఆర్పీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన విజయం సాధించి, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.