30-01-2026 12:37:30 AM
సూర్యాపేట, జనవరి 29 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ లో భాగంగా రెండోరోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా 432 నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో మొత్తం 141 వార్డులు ఉండగా వీటికి రెండో రోజున సూర్యాపేటలో మొత్తం 48 వార్డులకు, 230 నామినేషన్ లు, కోదాడలో 35 వార్డులకు 49, నేరేడుచర్లలో 15 వార్డులకు 37, తిరుమలగిరిలో 15 వార్డులకు 49, హుజూర్ నగర్ లో 28 వార్డులకు 67 నామినేషన్ లు దాఖలు కాగా మొత్తం 432 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలి రోజున దాఖలైన 24 నామినేషన్లతో కలిపి రెండు రోజులకు గాను 450 నామినేషన్లు దాఖలైనట్టు వివరించారు. కాగా నేడు నామినేషన్ లకు చివరి రోజు కావడంతో నేడు నామినేషన్లు ఎక్కువ దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
చిట్యాల మునిసిప్పాలిటీలో
చిట్యాల, జనవరి 29 : చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు గురువారం దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 16, బి ఆర్ ఎస్ అభ్యర్థులు 15 మంది, బిజె పి 4, బీఎస్పీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 44 మంది రెండవ రోజు నామినేషన్లు దాఖలు చేయగా, మొద టి రోజు 9 నామినేషన్లను కలుపుకొని మొ త్తం 53 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
చండూరులో
చండూరు, జనవరి29 : చండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు వివిధ పార్టీల నుండి 29 నామిస్ దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ ఎలిశెట్టి మల్లేశం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి 14, బిఆర్‌ఎస్ పార్టీ నుండి 04, బి.ఎస్.పి నుండి 06, ఇండిపెండెంట్ అభ్యర్థులనుండి 03, బిజెపి పార్టీ నుండి 01, ఇతరుల నుండి 01 మొత్తం 29 నామినేషన్ గురువారం వేశారు. రిటర్నింగ్ కార్యాలయను చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మల్లేశం, సీఐ ఆదిరెడ్డి పరిశీలించారు