30-01-2026 12:35:48 AM
ముషీరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చాలగాటం ఆడుతుందని అయన మండిపడ్డారు. రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూ రు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజ్ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా ర్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్దె త్తున ఆం దోళన కార్యక్రమాన్ని చెప్పాడుతామని ఎంపీ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, పగిల్ల సతీష్, రాందేవ్ మోదీ, నిమ్మల వీరన్న, తదితరులు పాల్గొన్నారు.