calender_icon.png 2 December, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్దం సుభాష్‌రెడ్డి ప్రజానాయకుడు

02-12-2025 12:00:00 AM

నివాళులర్పించిన బీజేపీ కార్పొరేటర్లు 

ఎల్బీనగర్, డిసెంబర్ 1 : గడ్డిఅన్నారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్, స్వర్గీయ బద్దం సుభాష్ రెడ్డి 6వ వర్ధంతిని సోమవారం పీ అండ్ టీ కాలనీ చౌరస్తాలో నిర్వహించారు.  బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాశ్ ఆధ్వర్యంలో సుభాష్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని  జిహెచ్‌ఎంసి పారిశుభ్ర సిబ్బంది, ఎంటామాలజీ సిబ్బందికి స్వెట్టర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. 

బీజేపీ కార్పొరేటర్లు రంగా నర్సింహా గుప్తా, నాయికోటి పవన్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, చిలకూరి రామ్ రెడ్డి తదితరులు పాల్గొని సుభాష్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా మాట్లాడుతూ.. సుభాష్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసిన నాయకుడని, మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘమన్నారు.

ఆయన చూపించిన మార్గం నేటికీ మాకు స్ఫూర్తినిస్తుందన్నారు. కార్పొరేటర్ నాయికోటి పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో నాకు గురువు బద్దం సుభాష్ రెడ్డి అని, ఆయన కలలను నిజం చేసేందుకు మేమంతా కట్టుబడి ఉన్నామన్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మా నాన్నగారి వర్ధంతి నిర్వహించడం, నా మనసును బాధ కలిగిస్తుందన్నారు. 

నాన్న గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో సీసీ రోడ్లు, నాలా పనులు, డ్రైనేజీ పనులు, కాలనీ సౌకర్యాల  అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గడ్డిఅన్నారం మున్సిపల్ అభివృద్ధి దిశగా నడిపించారన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా సేవ చేస్తున్నానని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయ ప్రకాష్, నాయకులు ఆనంద్ కుమార్, శ్రీధర్ రెడ్డి, నర్సింహ, శ్రీనివాస్, చిలకూరి జనార్దన్ రెడ్డి, సుందర్ నారాయణ, సుబ్బారెడ్డి, మురళి, నగేష్ నాయక్, సుజాత, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, ధనరాజ్, సిరి, శిరీష, సందీప్, సతీష్, హనుమంత్ రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్, అనిల్, లోకేశ్, మహేశ్, శ్రీకాంత్ నాయుడు, శరత్, వంశీ యాదవ్, సిద్దు, రఘునందన్ జోషి, టీంకు, శశాంక్, హరీష్, నాని తదితరులు పాల్గొన్నారు.