calender_icon.png 2 December, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే లక్ష్యం

02-12-2025 12:00:00 AM

శామీర్ పేట్ , డిసెంబర్ 1: టీయూడబ్ల్యూజే యూనియన్ పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఆదరణ లభిస్తుందని టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు , ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డిలు అన్నారు.  సోమవారం శామీర్ పేట్ మండల కేంద్రంలో ప్రింట్ మీడియా సభ్యులకు టియుడబ్ల్యూజే గుర్తింపు కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే యూనియన్ ధ్యేయం అని  యూనియన్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఆదరణ లభిస్తుందని అన్నారు . జర్నలిస్టుల సమస్యలను త్వరిత్తగతి పరిష్కరించుటకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి , శామీర్ పేట్  మండలం ప్రింట్ మీడియా అధ్యక్షుడు క్యాతం రవి, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రభాకర్ యాదవ్, ఉపాధ్యక్షులు మంచాల శేఖర్, కోశాధికారి గిరిప్రసాద్, ముఖ్య సలహాదారులు  దేశం కృష్ణ, నరసింహారావు,  సింగిరెడ్డి వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు రవీందర్ గౌడ్, శ్రవణ్ కుమార్, యాదగిరి ( చిన్న ), సభ్యులు శ్రీనివాస్, బాలకృష్ణ, రవి గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.