calender_icon.png 22 November, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి స్వరూపిణి.. నమోస్తుతే!

17-08-2024 01:12:54 AM

Click Here : ప్రకృతి స్వరూపిణి.. నమోస్తుతే!

- (‘శ్రీ లలితా సహస్ర నామ స్త్రోతం’ నుండి..)

‘అఖిలాండేశ్వరీ తన చేతివేళ్ళ గోళ్ళనుండి 

నారాయాణాది దశావతారాలనూ ఉద్భవింపజేసింది’ అని పై శ్లోకానికి అర్థం. ఇందులోని గుప్తనామములు ‘కర’ అంటే ‘కిరణము’ లేదా ‘బాహువు’ (చేయి), ‘అంగుళీ’ (ఈ కిరణములు మళ్ళీ ఉపకిరణములుగా) వెళ్ళుట. అంటే, నారాయణ నఖోత్పన్నయైన కాంతి నుండి నారాయణ సృష్టి మార్గం ఏర్పడింది.

అమ్మవారి గోళ్ళ కాంతిచేత సమస్త సృష్టి ఏర్పడింది. అమ్మవారి ఉపాసనా శరీరము ఎంతో మహిమాన్వితమైంది. ఇది ఆనంద ఖనమున ఉద్భవించిన సృష్టి రహస్యం. అమ్మవారు సర్వసృష్టికి అధిష్టాది. నాధాకృతి, కర అంగుళీ, నఖ, దశ, ఆకృతిః  ఈ మాటల చేత అమ్మవారిని ఉపాసించవలసిన స్థూల విగ్రహ రూపము (శరీర రూపము) పై శ్లోకంలో చెప్పబడింది. ఆమె కరుణా తరంగిణి. ఔషధ స్వరూపిణియై, వనదుర్గ రూపమై ఆదుకుంటూ అందరికీ

ఆనందాన్నిచ్చిన ‘అన్నపూర్ణేశ్వరి’ 

(వీరినే శాఖాంబరీ అని కూడా అంటారు).

భవానీ చేతుల కొనగోటి నుండి సృష్టి మొదలై తిరిగి ఆమె పాదములవద్ద చేరడమే సృష్టి క్రమ వలయం. జాగ్రత్స్వప్న సుశుక్తి తుర్యాతీతములనే జీవకృత్యములు వీటన్నింటినీ కల్పించుకునే మనోబుద్ధి చేత ఏర్పడే అహంకార సంకల్పాలు. ఈ పది కలిస్తే 

దశాకృతుల మార్గం. అలాగే సృష్టి, స్థితి, లయ, 

తిరోధానము, అనుగ్రహములు అనే ఐదు కృత్యములు. ఇవి జగత్తులో తిరుగులేనివి అవి 1. పృథ్వి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని. 

బహిసృష్టిలో పిండాండములు. చైతన్య కామ 

ప్రవృత్తిని పుట్టించే పంచ కర్మేంద్రియాలు. 

ఇవన్నీ కలిసి ఆజ్ఞాచక్రంలో దర్శించుకోగలగడం 

ఒక తపస్సు. ఔషధములు, అన్నము, పురుషుడు, ప్రాణము జడచేతనములు. ఇది అంతా ప్రకృతి. అమ్మవారు ‘ప్రకృతి స్వరూపిణి’ అని రహస్యం.

 శ్రీమతి సీ విజయలక్ష్మీరాజం