calender_icon.png 30 January, 2026 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణానది తీరంలో అలవి వల వేట

30-01-2026 01:03:11 AM

అధికారులే అండా దండా.

కొల్లాపూర్ రూరల్, జనవరి 29: నదులు, జలవనరులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే మత్స్య మాఫియాతో చేతులు కలిపి కృష్ణా నది పరివాహ ప్రాంతాల్లో చేప పిల్లల సంపదను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కృష్ణా నదిలో రాత్రిపగలు అనే తేడా లేకుండా నిషేధిత అలవి వలలు విసిరి చేప పిల్లలను పూర్తిగా వేటాడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పట్టిన చేప పిల్లలను ఎండబెట్టి కోట్ల రూపాయల వ్యాపా రానికి తరలిస్తూ, మత్స్య మాఫియాకు అధికారులు కేరాఫ్ అడ్రస్గా మారారని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రతి ఏడాది సుమారు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి నదిలో చేప పిల్లలను వదులుతుంటే, అధికారుల కనుసైగల్లో కొందరు దళారులు అలవి వలలతో వేట సాగించి స్థానిక మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు గ్రామాల కృష్ణా నది అటవీ ప్రాంత తీర ప్రాంతాల్లో గుడారాలు, షెల్టర్లుగా ఏర్పాటు చేసి ఈ అక్రమ వేట యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు సమాచారం. అటవీ, రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ వంటి అధికారులకు ఒక్కో పట్టుకు సుమారు లక్ష రూపాయల వరకు కమిషన్లు ముడుపులుగా అందుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలకు చెందిన చేపల వేటగాళ్లను రప్పించి మరీ అలవి వలల వేట సాగుతున్నదంటే, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, దోపిడీ స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ వేటపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.