calender_icon.png 30 January, 2026 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాశాఖ తీరే వేరు..!

30-01-2026 01:01:55 AM

పెద్ద పెద్ద హోర్డింగ్‌లో ప్రవేశాలు ప్రారంభమంటూ ప్రచారం

వెలుగులోకి వచ్చిన గుర్తింపు లేని స్కూళ్లు

అనుమతి లేదని 3 పాఠశాలలకు తాళం

అనుమతి లేని పాఠశాలలో చేర్పించకూడదు : ప్రవీణ్ కుమార్, డీఈవో 

మహబూబ్నగర్, జనవరి 29 (విజయక్రాంతి) : అనుమతి ఉన్న లేకపోయినా మా ది ఇంటర్నేషనల్ స్కూల్ మీ బిడ్డలను చేర్పించండి అంటూ పెద్ద పెద్ద హోల్డింగ్ లలో ప్ర చారం చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆయోమయానికి గురి చేస్తూ కొన్ని ప్ర వేటు పాఠశాలల యాజమాన్యాలు వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యాశాఖ అనుమతి లేకపోయినప్పటికీ పట్టణ ప్ర ధాన కూడలలో కూడా భారీ ఎత్తున హో ల్డింగ్ లు ఏర్పాటు చేసి ఆకర్షణీయమైనటువంటి బోర్డులు ఏర్పాటు చేసుకుంటూ మా పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభమైనవి పరిమిత సీట్లే ఉన్నాయి అంటూ ఎవరికి వారు గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా మా స్కూలు ఎన్నో ఉన్నాయని ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు నుంచే ప్రవేశాల వేట ఇప్పటికే ప్రా రంభించి విద్యార్థులను ఆకర్షించే పనిలో ప డ్డాయి . అనుమతులు ఉన్నాయా లేవా అనే తనిఖీలు కూడా విద్యాశాఖ చేపట్టకపోవడం తో గత కొన్ని రోజులుగా కొన్ని ప్రైవేట్ పాఠశాలల తీరు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నాణ్యమైన విద్య అందించడం ఎంత ముఖ్యమో ఆయా పాఠశాలకు అనుమతులు కూడా అంతకంటే ముఖ్యమని ప లువురు ప్రత్యేకంగా చెబుతున్న మాట. 

అధికారులు ఎందుకు కదలరు.?

ఇంత పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో మా పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యా యి అని చెప్పుకుంటున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు అంతు చిక్కని ప్ర శ్నగా మిగులుతుంది. విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు మీడియా ఇలాంటి విషయాలను వెలుగులోకి తెచ్చినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఆ తర్వాత య ధావిధిగా ఆ ప్రక్రియ కొనసాగుతూనే వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తు తరాలకు మంచి విద్య అందించేందుకు సహకరించాల్సిన విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు ప్రముఖులు కోరుతుండ్రు. 

చర్యలు పాఠశాల యాజమాన్యం పైనే కాదు..

అనుమతులు లేనిది కూడా పరోక్షంగా సహకరిస్తూ ఏం తెలియదన్నట్టు వ్యవరిస్తున్న విద్యాశాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భరత్ పేర్కొన్నారు. అధికారులు ఉన్నదే పర్యవేక్షణ కోసమని ప్రత్యేక శాఖ ఉన్నప్పటికీ విద్యాశాఖ నిర్వాణపై ఇలాంటి చర్యలు తీసుకోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి అడ్మిషన్ పొందిన తర్వాతకు అనుమతులు లేదని చేరకూడదని అధి కారులు నామమాత్రపు చర్యలు తీసుకోవ డం సరికాదని వారు డిమాండ్ చేశారు. పెద్ద హోల్డింగ్ లు కట్టినప్పటికీ కూడా అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా పూర్తిస్థాయిలో కట్టుదిట్టం చేసి అనుమతులు ఉన్న పాఠశాలలోనే విద్యార్థులు చదివేల చూడాలని వారు కోరారు. 

ఈ పాఠశాలలో చేర్పించకండి.. ప్రవీణ్ కుమార్, డిఇఓ మహబూబ్ నగర్

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ది మాస్టర్ మైండ్ స్కూల్, ఆర్చీడ్స్ ది స్కూల్ లకు అనుమతులు లేవని విద్యార్థులను ఏ పాఠశాలలో చేర్పించిన అనుమతులు ఉన్నాయా లేదా తెలుసుకోవాలని డిఇఓ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై త ల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అనుమతి ఉన్న పాఠశాలలో తమ బిడ్డలను జరి పించాలని డిఓఓ తెలియజేసిన ప్రకటనలో పేర్కొన్నారు.