calender_icon.png 30 January, 2026 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ అవార్డు పొందిన అధికారులకు సన్మానం

30-01-2026 01:04:46 AM

శ్రీరంగాపురం జనవరి 29: మండల కేంద్రంలో ఉత్తమ అవార్డులు పొందిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నం చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి రాజు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉత్తమ సేవలందించిన ఎస్‌ఐ హిమబిందు, వ్యవసా య అధికారి హైమావతి లకు గత జనవరి 26 రోజున కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు స్వీకరించినందుకు అభినందించి శాలువాలతో సన్మానం చేశారు. ఇకముందు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విష్ణు ,రా మచంద్రయ్య యాదవ్ , బహుజన రమేష్ తదితరులు పాల్గొన్నారు.