16-05-2025 12:08:12 AM
అనుమతులు లేకుండా కబ్జా చేసిన స్థలాలను కూల్చివేసిన అధికారులు
కామారెడ్డి, మే 15 (విజయ క్రాంతి): మున్సిపల్ స్థలాలను కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారిపై విజయ క్రాంతి దినపత్రికలో ఫిబ్రవరి 22న 'అనుమతులు ఒక రకం నిర్మాణాలు మరో రకం' శీర్షికతో వచ్చిన వార్త కు ఎట్టకేలకు మునిసిపల్ అధికారులు స్పందించారు. కబ్జా చేసి నిర్మించిన స్థలాలను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు.
అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి ఊహించని షాక్ ను మున్సిపల్ అధికారులు ఇచ్చారు. ఎంతోమంది బల్దియా కౌన్సిలర్ల ముడుపులు ఇచ్చి నిర్మించుకున్న వారికి షాకు ఇచ్చారు. లక్షల రూపాయల వృధా అయ్యాయని అక్రమ నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక అధికారుల పాలన కోన సాగుతుండడంతో పాటు స్థానికులు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అక్రమాణాలకు పాల్పడ్డ స్థలాలను కూల్చివేశారు. మురికి నీటికాల్వలకు ఇబ్బంది ఇబ్బంది ఏర్పడడమే కాకుండా దుర్వాసన వస్తుందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. దీంతో కూల్చివేయడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.