calender_icon.png 28 September, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మలో వెదురు విశిష్టత

23-09-2025 12:00:00 AM

ప్రకృతి సిద్ధంగా లభించే వెదురుతో తయారు చేయబడిన సిబ్బి అంటేనే గంగమ్మ, గౌరమ్మలకు అత్యంత ఇష్టము. నోములు వ్రతాలలో వెదురు పాలవెల్లి చాట ఉపయోగించి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు పొందుతారు. వెదురు మొంటె గుల్లలతో అమ్మవారికి పూజలు చేస్తారు. దీనితో పాటు వెదురు సిబ్బిలో బతుకమ్మను పేర్చడం అనేది అత్యంత భక్తిశ్రద్ధలతో కూడుకున్నది.

తంగేడు, గునుగు, కట్ల, టేకు, సంపెంగ,ముద్ద,మందారం, మరువం, పారిజాతం, కమలం, తామరం, గన్నేరు,గుమ్మడి,గులాబీ,పట్టుకుచ్చులు తదితర రంగురంగుల పుష్పాలతో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను పేర్చుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. వెదు రు సిబ్బిలో అందంగా అలంకరించిన బతుకమ్మను మహిళలంతా కలిసి సాయంకాలం చెరువుల తీరాలకు చేరుకొని అంతా కలిసి పా టలు పాడి, ఆటలు ఆడుకున్న అనంతరం బతుకమ్మలను నీళ్లలో వదిలి వచ్చేస్తారు.  నేటి పారిశ్రామిక ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ లాంటి మాయలో పడకుండా ఉండేందుకు ఇలాంటి వేడుక సందర్భంగా వినియోగించే వెదురు వస్తువులే మన కళకు తార్కానంగా నిలుస్తాయి.

తద్వారా వెదురు సిబ్బి అల్లుకొని జీవించే మేదరుల జీవితాల్లో వెలుగులు నింపుతాయి ఆధ్యాత్మిక క్రమశిక్షణ, మానవీయ విలువలు, పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాలను కాపా డేందుకు బతుకమ్మ బాటలు వేస్తుంది. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను దాని విశిష్టతను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా, ప్రపంచం అంతా విస్తరించే విధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రకృతి పరవశించిపోయే విధంగా పూల పండుగ బతుకమ్మ పండుగకు వెదురు సిబ్బిలో పేర్చిన బతుకమ్మ శోభను తెస్తుందని ఆశిద్దాం.

 ప్రతాప్‌గిరి శ్రీనివాస్, హనుమకొండ

దసరా సెలవులు పెంచాలి

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, పాలిటెక్నిక్, మైనారిటీ, గురుకులలు, కస్తూర్బా కళాశాలలకు సెప్టెంబర్ 22 నుంచి సెలవు దినాలు ప్రకటించింది. ఆదివారం మొదలైన బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించనున్నా రు. అయితే తెలంగాణ ఇంటర్ బోర్డు పరిధిలో ఉండే ఇంటర్ కళాశాలకు 28 తేదీ నుంచి సెలవులని ప్రకటించారు దీనివల్ల తెలంగా ణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు కోల్పోతారు.

ఇ చ్చే సెలవుల్లో కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆదివా రం, శనివారం పోగా ప్రభుత్వ పరంగా ఇచ్చే సెలవులు మూడు మాత్రమే. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వచ్చి బతుకమ్మ, దసరా ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. దీనివల్ల మహిళా ఉపా ధ్యాయులు, విద్యార్థులకు అవకాశం ఉండదు. అందుచేత తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ విషయంలో పునఃపరిశీలన చేసి ఇంటర్ కాలేజీలకు సెలవులను పెంచాలని మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. 

 ఉమా శేషారావు, కరీంనగర్