28-09-2025 12:31:06 AM
-సిటీ కొత్వాల్‌గా వీసీ సజ్జనార్
-ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
-సివిల్‌సప్లు వీసీఎండీగా స్టీఫెన్ రవీంద్ర
-రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
-మొత్తంగా 29 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక స్థానాలకు అధికారుల సామర్థ్యాన్ని బట్టి పోస్టింగ్‌లు ఇచ్చింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్‌రెడ్డిని శుక్రవారం నియమించిన సర్కార్.. శనివారం ఉదయానికల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టి కీలక స్థానాలను భర్తీ చేసింది.
మొత్తంగా 29 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రొటోకాల్ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూను రోడ్లు, భవనాల శాఖలో స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేసిం ది. సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం.హరితను నియమించింది. అలాగే పలువురు ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించగా, మరికొందరు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇక ఐపీఎస్‌ల బదిలీల్లో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా హైదరాబా ద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్‌కు పోస్టింగ్ ఇచ్చింది. ఆ స్థానంలో కొనసాగుతున్న రవిగుప్తాను సెం టర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీగా నియమించ గా.. నూతన కొత్వాల్ (హైదరాబాద్ పోలీసు కమిషనర్) బాధ్యతలను ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్‌కు అప్పగించింది. అలాగే ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డిని.. సివిల్ సప్టు కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర.. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా శిఖాగోయల్‌ను నియమించారు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు ఇలా .. (ఐఏఎస్‌లు..)
1. సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ : వాణిజ్యపన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) జీఏడీ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్)
2. ఎం.రఘునందన్‌రావు : వ్యవసాయ, సహకార శాఖల సెక్రెటరీ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, (ఎఫ్‌ఏసీ) కమిషనర్, రవాణా శాఖ
3. కె.సురేంద్రమోహన్ : కమిషనర్, రవాణా శాఖ సెక్రెటరీ, వ్యవసాయ, సహకార శాఖ, (ఎఫ్‌ఏసీ) కమిషనర్ సహకార శాఖ, రిజిస్ట్రార్, సహకార సొసైటీలు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్
4. ఎం.హరిత : స్పెషల్ సెక్రెటరీ, విద్యా శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా
5. కె.హరిత : కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రెటరీ
6. సందీప్‌కుమార్ ఝా : కలెక్టర్, రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రెటరీ, రోడ్లు, భవనాల శాఖ
ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు ఇలా .. (ఐపీఎస్‌లు..)
1. రవిగుప్తా : హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ - ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
2. సీవీ ఆనంద్ : హైదరాబాద్ పోలీసు కమిషనర్ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ
3. శిఖా గోయల్ : డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీఏడీ, (ఎఫ్‌ఏసీ) డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
4. స్వాతి లక్రా : అడిషనల్ డీజీ, అర్గనైజేషన్ అండ్ హోం గార్డ్స్ (ఎఫ్‌ఏసీ) డీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
5. ఎం.ఎం.భగవత్ : అడిషనల్ డీజీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ (పర్సనల్)
6. చారు సిన్హా : అడిషనల్ డీజీ, సీఐడీ (ఎఫ్‌ఏసీ) డీజీ, ఏసీబీ
7. డా.అనిల్ కుమార్ : అడిషనల్ డీజీ (పర్సనల్) అడిషనల్ డీజీ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్ అండ్ అక్టోపస్
8. వి.సి.సజ్జనార్ : ఎండీ, టీజీఎస్ ఆర్టీసీ కమిషనర్, హైదరాబాద్
9. విజయ్‌కుమార్ : డీజీ, ఏసీబీ అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్
10. వై.నాగిరెడ్డి : డీజీ, డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ ఎండీ, టీజీఎస్ ఆర్టీసీ
11. డీ.ఎస్.చౌహాన్ : ప్రిన్సిపల్ సెక్రెటరీ, అండ్ కమిషనర్, పౌర సరఫరాల శాఖ అడిషనల్ డీజీ, మల్టీ జోన్
12. విక్రమ్ మాన్‌సింగ్ : అడిషనల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్), హైదరాబాద్ డీజీ, డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్
13. స్టీఫెన్ రవీంద్ర : అడిషనల్ డీజీ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్, అక్టోపస్ కమిషనర్, పౌరసరఫరాల శాఖ (ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రెటరీ)
14.ఎం.శ్రీనివాసులు : ఐజీపీ, సీఐడీ కమిషనర్, క్రైం, హైదరాబాద్
15.తఫ్సీర్ ఇక్బాల్ : డీఐజీ, జోన్ 6 చార్మినార్, (ఎఫ్‌ఏసీ) ఐజీపీ, మల్టీజోన్ 2 జాయింట్ కమిషనర్ (లా అండ్ అర్డర్), హైదరాబాద్
16. ఎస్.ఎం.విజయ్‌కుమార్ : డిప్యూటీ కమిషనరల్, వెస్ట్‌జోన్, హైదరాబాద్ కమిషనర్, సిద్దిపేట
17. సింధుశర్మ : ఎస్పీ, ఇంటెలిజెన్స్ జాయింట్ డైరెక్టర్, ఏసీబీ
18. డాక్టర్ జి.వినీత్ : డీసీపీ, మాదాపూర్, సైబరాబాద్ నారాయణ్‌పేట జిల్లా
19. డాక్టర్ బి.అనురాధ : కమిషనరల్, సిద్ధిపేట డీసీపీ, ఎల్బీనగర్ జోన్, రాచకొండ
20. సీహెచ్ ప్రవీణ్‌కుమార్ : డీసీపీ, ఎల్బీనగర్ జోన్, రాచకొండ జాయింట్ డైరెక్టర్, ఏసీబీ
21. యోగేష్ గౌతమ్ : ఎస్పీ, నారాయణ్‌పేట జిల్లా డీసీపీ, రాజేంద్రనగర్, సైబరాబాద్
22. సీహెచ్ శ్రీనివాస్ : డీసీపీ, రాజేంద్రనగర్ , సైబరాబాద్ డీసీపీ, వెస్ట్‌జోన్, హైదరాబాద్
23. రితిరాజ్ : జాయింట్ డైరెక్టర్, ఏసీబీ డీసీపీ, మాదాపూర్, సైబరాబాద్