13-05-2025 12:51:28 AM
సిరిసిల్ల, మే 12 (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్, బీఎస్పీ నాయకులు, గ్రామస్తులు సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు తాడెం శ్రీనివాస్, నాయకులు గాలిపెల్లి స్వామి, ఉరడి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ లో. చేరారు.
అలాగే ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షనీయం అన్నారు.
పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను గజమాలతో సత్కరించారు... కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య, గుర్రం విద్యాసాగర్ , అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.