27-12-2025 12:52:47 AM
డీసీపీ డైరెక్టర్ చాపల యాదగిరి రెడ్డి
మరిపెడ డిసెంబర్26 (విజయక్రాంతి)మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు గ్రామపంచాయతీ లొ గ్రామ అభివృద్ధి పనిచేయాలని డిసిసి డైరెక్టర్ మరిపెడ సొసైటీ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి అన్నారు. వెంకంపాడు పాకాల చెరువు కట్టకు ఇరువైపులా పిచ్చి చెట్లను తొలగించే కార్యక్రమాన్ని వెంకంపాడు గ్రామపంచాయతీ యువ సర్పంచ్ ఉప్పల చిన్న సోమన్న ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం.
డిసిసి డైరెక్టర్ మరిపెడ సొసైటీ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యువకుల తోటే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సర్పంచ్ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకంపాడు ఉపసర్పంచ్ బాదావత్ హుస్సేన్, ఉప్పల భిక్షం, బిల్లు నాయక్ ,మేన వెంకన్న , ఉల్లయ్య, అవిలయ్య వెంకన్న, బుర్ర రమేష్, వెంకన్న, వీరమల్లు, ఉప్పల పెద్ద సోమన్న, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.