15-11-2025 07:42:10 PM
* ఈనెల 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్
అచ్చంపేట: మామిడి రైతులకు 50 శాతం రాయితీపై కవర్లను ఉద్యాన శాఖ అచ్చంపేట డివిజన్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. డివిజన్ పరిధిలోని అచ్చంపేట, లింగాల, ఉప్పునుంతల, బల్మూరు మండలాల రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మామిడిలో కాయ అభివృద్ధి చెందే దశలో పండు ఈగ, మంగు తామర పురుగు ప్రభావం అధికంగా ఉండడం, తెగుళ్లు ఆశించడం ద్వారా రైతుకు ఎక్కువగా నష్టం చేకూరుతుందని అన్నారు.
దీని నివారణకు కాయ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మామిడి కవర్లను తొడగడం ద్వారా కాయ నాణ్యత, సైజు పెరగడంతో పాటు కాయ అధిక రంగు కలిగి ఉండడం ద్వారా మార్కెట్లో సాధారణ ధర కంటే కొంతమేరకు అధిక ధర పలికే అవకాశం ఉంటుందన్నారు. మామిడి కవర్ పై బాగానా జి ఐ వైర్ కాయపై బాగానే ఉన్నా పెడిసిల్ (కొమ్మ కాడాకు)కి కట్టడం ద్వారా అకాల వర్షాలు, గాలుల వీచిన కాయ కిందికి రాలకుండా కాపాడుతుందని చెప్పారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మామిడి రైతులకు 50% సబ్సిడీపై మామిడి కాయలు కవర్లను అందజేస్తున్నమని చెప్పారు. ఈనెల 17 నుంచి దరఖాస్తులను సేకరిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు 8977714293 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.