calender_icon.png 2 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

02-01-2026 12:20:08 AM

నిర్మల్, జనవరి ౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎస్బిఐ లీడ్ బ్యాంక్ జిల్లా పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆదరణ రూపొందించిన 2026 క్యాలెండర్, డైరీని కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. వివిధ శాఖలో పనిచేసే ఉద్యోగులు అందరు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చి పారదర్శకమైన పాలన ఈ సంవత్సరం అందించే విధంగా మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ డిఆర్‌ఓ రత్నా కళ్యాణి డిపిఓ శ్రీనివాస్ జెడ్పి సీఈఓ శంకర్ డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ జిల్లా అధికారులు ఉన్నారు.