calender_icon.png 27 September, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో బతుకమ్మ సంబురాలు

27-09-2025 01:38:19 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సి టీలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం ఈవేడుకలను సీఈవో ఎస్. నీలిమ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. అంతకుముందు బంతిపూలు, చామంతి తదితర తిరోక్క పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చారు.

అధ్యాపకులు, కళాశాల విద్యార్థినులు సాంప్రదాయ దుస్తు లను ధరించారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ పాటలను విద్యార్థులు ఆడి పాడారు. ఈ కార్యక్రమానికి అనురాగ్ యూనివర్సిటీ డీన్ లు ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్, విష్ణుమూర్తి, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ డాక్టర్ శిరీష, అసోసియేట్ డీన్ చలపతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, అనురాగ్ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

ప్రగతి రిసార్ట్‌లో ..

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 26: ప్రగతి రిసార్ట్లో శుక్రవారం బతుకమ్మ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో ఉద్యోగులు, కుటుంబ సమేతంగా విల్లా యజమానులు అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్మన్ డాక్టర్ జి .బి. కే. రావు, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ చంద్ర,ఫైనాన్స్ డైరెక్టర్ జి.వి.కుమారి, డైరెక్టర్ పి.ఏ.ఎం, రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  డాక్టర్ జి బి కే రావు మాట్లాడుతూ. బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని అని పిలుపునిచ్చారు.