02-09-2025 12:55:15 AM
టెక్ మహీంద్రా భాగస్వామ్యం
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ ఆరోగ్య సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ సోమవారం టెక్ మహీంద్రాతో కలిసి హైదరా బాద్‌లో ప్రపంచ ఆరోగ్య సేవల్లో ఉపయోగించే ఉత్తమ పద్ధతులతో అభివృద్ధి చేసిన అత్యాధునిక 24x7 బహుభాషా కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. రోగులు సులభంగా డాక్టర్లను, సేవలను సంప్రదించేందుకు, మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ సెంటర్ను రూపొందించారు.
దీని ద్వారా రోగులకు అందుబాటులో, తక్కువ ఖర్చుతో కూడిన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే కేర్ హాస్పిటల్స్ ముఖ్య లక్ష్యం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ సీనియర్ చీఫ్ సేల్స్ అండ్ మార్కె టింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్) వినోద్ రామన్, చీఫ్ హాస్పిటాలిటీ, పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ విజయ్ సేథి, వైస్ ప్రెసిడెంట్ క్వాలిటీ,
అక్రిడిటేషన్ రాజీవ్ చౌరే, నాంపల్లి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శశికాంత్ అగ్సారే, స్ట్రాటజీ, న్యూ ఇనిషియేటివ్స్ హెడ్ నవీన్ నారాయణన్, కాల్ సెంటర్ ఆపరేషన్స్ హెడ్ సిమ్రన్ కౌర్ సేథి పాల్గొన్నారు. టెక్ మహీంద్రా తరఫున ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ ఘురా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణన్ కవిక్కల్, రీజినల్ ప్రాజెక్ట్ హెడ్ *కార్తీక్*తో పా టు బిజినెస్ డెవలప్మెంట్ మరియు ట్రాన్స్ఫార్మేషన్ టీమ్ సభ్యులు హాజరయ్యారు.
టెక్ మహీంద్రాతో భాగస్వామ్యం ద్వారా ఆధునిక సిస్టమ్లు, తక్షణ అపాయింట్మెంట్ బుకిం గ్ సదుపాయం, శిక్షణ పొందిన కాల్ సెంట ర్ సిబ్బంది అందుబాటులోకి వస్తున్నారు. దీని వల్ల కేర్ ఆసుపత్రులన్నింటిలో వేగంగా స్పందన, రోగి అవసరాలను సమర్థంగా పరిష్కరించడం, రోగికి మొదటి నుంచి మంచి అనుభవం కల్పించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
కేర్ హాస్పిటల్స్ చీఫ్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ విజయ్ సేథి మాట్లాడుతూ.. “ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం సులభంగా, త్వరగా అందేలా చేయ డం మా కర్తవ్యంగా భావిస్తున్నాం” అన్నారు. “ఈ కొత్త కాల్ సెంటర్ ప్రారంభం మా రోగులు, వారి కుటుంబాలతో సంబంధాన్ని మరింత బలపరుస్తుంది” అని కేర్ హాస్పిటల్స్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ అన్నారు.
ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఆధారంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినోద్ రామన్ తెలిపారు. ‘కేర్ హాస్పిటల్స్తో భాగస్వామ్యం కావడం మాకు గర్వంగా ఉంది‘ అని టెక్ మహీంద్రా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ ఘురా తెలిపారు. కేర్ హాస్పిటల్స్ కాల్ సెంటర్ ఆపరేషన్స్ హెడ్ సిమ్రాన్ కౌర్ సేథి మాట్లాడుతూ, “=వేగవంతమైన సేవలు, ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక టెక్నాలజీ, 24 గంటల అంకిత బృందంతో మా కాల్ సెంటర్, అన్ని కేర్ ఆసుపత్రులలో రోగి అనుభవానికి కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తోంది అని తెలిపారు.