17-09-2025 02:05:49 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెకస్ట్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆల్పూర్ విద్యాసంస్థల అధినే త డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. సందర్భంగా ఆ యన మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్రానికి నూతన వైభవాన్ని తెస్తాయని, ఈ పండగ ద్వారా సమాజంలో ప్రేమ - ఆప్యాయతలు వ్యాప్తి చెందుతాయని అన్నారు.
తెలంగా ణ రాష్ట్ర ప్రతీక బతుకమ్మ పండుగ అని, ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ బతుకమ్మ పం డుగ అని, కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల నడుమ జరుపుకునేటువంటి పండుగని, ఎంతో విశిష్ట గల పండుగని వర్ణించారు. వేడుకల సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి బతుక మ్మ పద్యాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.