calender_icon.png 17 September, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..

17-09-2025 02:03:42 AM

మల్యాల,సెప్టెంబర్ 16 ( విజయ క్రాంతి ):ప్రధాని మోదీ చిత్రపటానికి మండల బి జె పి నాయకులు క్షీరాభిషేకం చేశారు. చొప్పదండి నియోజకవర్గం లోని ఆర్నకొండ నుండి మల్యాల వరకు రామడుగు,గంగాధర, మల్యాల మండలాలను కలిపే సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించినందుకుగాను హర్షం వ్యక్తం చేస్తూ కార్యక్రమం నిర్వహించారు.

మల్యాల మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు ఈసందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే నేడు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేవలం ఒక్క మల్యాల మండలంలోనే కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామగ్రామాన సిసి రోడ్లు వేసి అభివృద్ధి అంటే ఏంటో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో. బిజెపి మండల అధ్యక్షులు గాజుల మల్లేశం మాజీ ఎంపిటిసి సంఘని రవి. రాచర్ల రమేష్.  తదితరులు పాల్గొన్నారు.

-