calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ

24-09-2025 12:00:00 AM

మహిళ అధికారులతో కలిసి ఉత్సాహంగా కోలాటాలాడిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):  తెలంగాణ సాంస్కృతి సాంప్ర దాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. మంగళవారం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ముందుగా బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీరక పూలతో పేర్చిన బతుకమ్మను ఎత్తుకొని వచ్చిన కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో పాటు కోలాటాలాడుతూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపా రు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ఈ బతుకమ్మ పండగ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తీరక్క పూలను భక్తిశ్రద్ధలతో పూజించడమే ఈ బతకమ్మ పండగ ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు  ఆనందో త్సవాల మధ్య బతుకమ్మ వేడుకల నిర్వహించుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, మహిళ ఉద్యోగులు, యువతులు పాల్గొన్నారు.

నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేశారు. సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశా రు. ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఘనం గా నిర్వహించుకోవాలని తెలిపారు.     అంతకుముందు పలువురు మహిళా ఉద్యోగులు వేసిన రంగవల్లులను కలెక్టర్ పరిశీలించారు. సామాజిక అంశాలపై అవగాహన పెంపొందేలా రంగవల్లులను రూపొందించిన ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, ఆర్డిఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, మహిళా సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ గద్దె ధ్వంసం

నిర్లక్ష్యంగా తన కారును నడిపి బతుకమ్మ గద్దె కూల్చిన ఘటనలో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపిన వివరాల మేరకు... రూరల్ మండలంలోని జందాపూర్ గ్రామ పంచాయితీ కార్యదర్శి సుల్తానా బేగం గత రాత్రి తన కారును నిర్లక్ష్యంగా నడుపుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలోని బతుకమ్మ గద్దెపై నుండి తీసుకెళ్లారు. దింతో బతుకమ్మ గద్దె ధ్వంసం అయింది. దీంతో కాలనీకి చెందిన మహిళలు, గ్రామస్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిపట్ల కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిందని, బతుకమ్మ పట్ల అసభ్యంగా మాట్లాడిందని ఫిర్యాదు చేయడంతో గ్రామ కార్యదర్శి సుల్తానా బేగం పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఫణిదర్ తెలిపారు. 

ఈ ఘటనపై మంగళవారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. మరోవైపు బతుకమ్మ గద్దెను కూల్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శి సుల్తానా బేగంను సస్పెండ్ చేయాలని పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి ఫిర్యాదు చేశారు.