23-09-2025 11:49:39 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయంలో తొలి పూజ.. ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మొదటిరోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. దసరా నవరాత్రుల సందర్భంగా మంగళవారం రెండవ రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో శ్రీ వాసవి మాత అలంకరణ రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలిపారు.