calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొర్రమీను కేంద్రంగా కరీంనగర్

24-09-2025 01:24:27 AM

  1. రూ. 5 కోట్ల తో ఏర్పాటు

రూ. 2 కోట్లు మంజూరు.. రూ. కోటి విడుదల

కరీంనగర్, సెప్టెంబరు 23 (విజయ క్రాంతి): ఉత్తర తెలంగాణ కేంద్రంగా మర్రెల్ (కొర్రమీను) క్లస్టర్‌ను ఎల్‌ఎండిలో ఏ ర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో రెండు కోట్లు మంజూరు కాగా కో టి రూపాయలు విడుదల చేశారు. వీటితో పైపులైను, క్లస్టర్ పనులు చేపట్టనున్నారు.

కాగా చేప పిల్లల ఉత్పత్తి చేయడం మొదలు ఎదిగిన చేపలను అమ్మడం వరకు క్లస్టర్ ఆధీనంలో ఉంటుంది. కరీంనగర్ క్లస్టర్ క్రింద పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ప్యానెల్ కన్సల్టెన్సీతో పాటు మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి చెక పెట్టనున్నారు. చేప ప్రియు లు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్ కేంద్రం కాబోతోంది.

కొరమీను చేపల తో రాష్ట్రం కళ కళ లాడేలా మత్స్యశాఖ ప్ర ణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుం చి దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే వాటిని చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు అయితే కొరమీనుకు మన దగ్గర కొదువే ఉండదు. వాస్తవానికి తెలంగాణలో డిమాం డ్కు సరిపోను కొరమీను చేపలు అందుబాటులో లేవు. ఏపీతోపాటు ఒడిశా, ఇతర రా ష్ట్రాల నుంచి వీటిని తెచ్చి మన మార్కెట్లలో అమ్ముతుంటారు.

ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, సరిహద్దు ట్యాక్స్లతో పా టు కమీషన్లు కలిపి ఎక్కువ ధరకు వీటి విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం చేపల మార్కెట్లో కొరమీను కిలో రూ.300-500 వరకు ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు కొరమీనులను చేప ప్రియులకు అందుబాటులోకి తెచ్చేలా మత్స్యశాఖ చర్యలు తీసు కుంటోంది.

- నీటి వనరులే కీలకం

కొరమీను చేపల పెంపకానికి నీటి వనరులు ఎక్కువ అవసరం. ముఖ్యంగా నీటి చలన, ప్రవాహం ఉన్న వనరుల్లో ఇవి త్వర గా, బలిష్టంగా పెరుగుతాయి. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మత్స్యశాఖ కొ రమీను చేపల పెంపకానికి ఎంపిక చేసింది. దీంతోపాటు ఒండ్రుమట్టి ఎక్కువగా ఉంటే, అందులో ఉన్న నాచు కారణంగా కొరమీను చేపలు మరింత బలంగా పెరిగే అవకాశముంటుంది.

అందుకే ఒండ్రుమట్టి లభ్యత ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో కొరమీను పెంచాలని నిర్ణయించింది. ఎల్ ఎండి వద్ద 16 ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటాన్నారు.

- ఈ కేంద్రం తెరుచుకునేది ఎన్నడు..?

ఎల్ ఎం డి వద్ద కొత్త హేచరి ఏర్పాటు స్వాగతించ వలసిందే. కేశవపట్నం చేప పిల్ల ల కేంద్రం మూలకుపడింది. దీన్ని తెరిపించరా అని ప్రశ్నిస్తున్నారు గంగ పుత్రులు. ఒక ప్పుడు తెలంగాణలోనే నంబర్వన్ బ్రీడింగ్ కేంద్రంగా వెలసిన కేశవపట్నం శివారులోని పాపయ్యపల్లి దారిలోని చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రం ఎంతో పేరు గాంచింది.

దీని ని 1983లో అప్పటి ప్రభుత్వం 66 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ కాలువ దిగువన నిర్మించింది. మొదట 2 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి టార్గెట్తో హేచరీ ఏర్పాటు చేయగా, అప్పట్లో ఇది తెలంగాణలోనే కేంద్ర బిందువుగా వెలుగొందింది. ఇక్కడి నుంచే బ్రీడింగ్ అత్యధికం గా ఎగుమతి అయ్యేది. 

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేలాది చెరువులు, కుంటలకు చేప పిల్లల సరఫరా ఇక్కడి నుంచే జరిగేది. వేలాది మంది మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరికేది. కాలక్రమంలో దీనిని చేప పిల్లల కేంద్రంగా మార్చారు.

తర్వాత కూడా ఉత్పత్తి బాగానే జరిగినా అధికారుల అలసత్వంతో మూతపడింది. మూడేళ్ళ నుంచి మొత్తానికే నిరుపయోగంగా మారింది. కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. మత్స్యకారులు చేప పిల్లల కేంద్రాన్ని తిరిగి పునరు ద్ధరించాలని డిమాండ్‌చేస్తున్నారు.